Go to Top

సిలికాన్ స్కార్ ట్రీట్మెంట్ షీట్ – స్కార్ ట్రీట్

Silicone Sheet – ScarTreat

మచ్చల చికిత్స కోసం వాడే సిలికాన్ షీట్లు యు ఎస్  ఎఫ్ డి ఎ క్లాస్ 1 పరికరం. శస్త్రచికిత్స మరియు కాలిన మచ్చలు రెండింటినీ ఎదుర్కోవడానికి వైద్యులు 20 సంవత్సరాలకు పైగా  ఈ  ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఈ షీట్లు సాధారణంగా 0.6 మి.మీ. మందం ఉంటాయి మరియు మెడికల్ గ్రేడ్ సిలికాన్ తో తయారు చేయబడతాయి.

1982 లో, ఆస్ట్రేలియాలో ఒక పిల్లల ఆసుపత్రి, ఒత్తిడి సమానంగా పంపిణీ చేయబడుతుందని నిర్ధారించడానికి ఒత్తిడి వస్త్రాల క్రింద ఉపయోగించగల ఒక పదార్థం కోసం అన్వేషిస్తుండింది. సిలికాన్ జెల్ ఉన్న ప్రదేశంలో, మచ్చ మరింత వేగంగా మెరుగుపడింది అని గమనించబడింది. ఆస్ట్రేలియా లో ఈ ఆవిష్కరణ తరువాత, UK లో క్లినికల్ ట్రయల్స్  ప్రారంభమైనవి, అవి సిలికాన్ జెల్ విడిగా వాడినప్పుడు కూడా ప్రభావవంతమైనదని కనుగొన్నాయి.

సిలికాన్ షీట్లు అనేవి మచ్చల నిర్వహణకు  ఒక శస్త్రచికిత్స-రహిత, తక్కువ ఖర్చుతో కూడిన విధానం. అవి మచ్చ యొక్క రంగును తటస్థీకరిస్తాయి మరియు పైకి పెరిగిన మచ్చలను చదును చేస్తాయి. ఒక సిలికాన్ షీట్ మృదువైనది మరియు తేలికగా వంగునట్టిది మరియు శరీర వంపులకు సర్దుబాటు అవుతుంది. అవి ఉపయోగించడానికి సులభమైనవి. అవి హైపోఅలెర్జెనిక్ మరియు ఎటువంటి దుష్ప్రభావాలు ఉన్నాయని నివేదించబడలేదు. మచ్చ యొక్క వయసుతో సంబంధం లేకుండా కాలిన గాయాలు లేదా శస్త్రచికిత్స కారణంగా ఏర్పడిన మచ్చల మీద అవి బాగా పనిచేస్తాయి-కొన్ని అధ్యయనాలు 20 ఏళ్ల మచ్చలు పై కూడా విజయాన్ని చూపించాయి.

సిలికాన్ షీట్లు ఎలా పని చేస్తాయి?
చర్య యొక్క ఖచ్చితమైన పనితీరుపై ఇప్పటికీ చర్చ జరుగుతున్నప్పటికీ, సిలికాన్ షీట్లు క్రింది మార్గాలలో పని చేస్తున్నట్లుగా భావించబడుతున్నాయి:
1. హైడ్రేషన్ – మచ్చ ప్రాంతంలో నిరంతరం తడిగా ఉంచడం
2. ఆ ప్రాంతంలో ఒత్తిడిని ఆపడం
3. ప్రాథమిక ఫిబ్రో బ్లాస్టిక్ వృద్ధి కారకాల మాడ్యులేషన్ (bFGF).
4. సూక్ష్మజీవులు మరియు రసాయనాల నుండి సైట్ ను రక్షించడం
5. ఘర్షణ కారణంగా నిశ్చల విద్యుత్ క్షేత్ర సృష్టి

 

Scar Fading after using Silicone Sheet

Scar Fading after using Silicone Sheet

Facial Scar fading after use of Silicone Sheets

Facial Scar fading after use of Silicone Sheets

Wide Scar fading after use of silicone sheet

Wide Scar fading after use of silicone sheet

Hypertrophic Scar fading after use of Silicone Sheet

Hypertrophic Scar fading after use of Silicone Sheet

Images Credit – www.siliconeforscars.com

 

వినియోగ సందర్భాలు
సిలికాన్ షీట్లను ఈ క్రింది కారణాల వల్ల మచ్చలు కోసం ఉపయోగించవచ్చు:

 • కాలిన గాయాలు
 • కెలాయిడ్ అండ్ హైపర్ట్రోఫిక్ మచ్చలు
 • సి సెక్షన్,స్టెర్నోటమి, బారియాట్రిక్ శస్త్రచికిత్స, టమ్మీ టక్స్ (అదనపు కొవ్వును తొలగించడానికి చేసే శస్త్రచికిత్స) తో సహా శస్త్రచికిత్సా సంబంధిత మచ్చలు
 • మొటిమ మచ్చలు
 • గాయం కారణంగా ఏర్పడే మచ్చలు

సిలికాన్ షీట్లను తాజా గాయం లేదా శస్త్రచికిత్స సైట్లో వాడకూడదు. ఒక శస్త్రచికిత్స జరిగిన 2-3 వారాల తర్వాత కుట్ల తొలగించబడి మరియు గాయం నయమైన తర్వాత మాత్రమే వాటిని ఉపయోగించవచ్చు.

స్కార్ ట్రీట్ సిలికాన్ షీట్లు ఎందుకు 

 • యూరోపియన్ మెడికల్-గ్రేడ్ సిలికాన్ ను ఉపయోగించి తయారు చేయబడింది. చవుక పోటీదారులు చైనీస్ పారిశ్రామిక గ్రేడ్ సిలికాన్ ను ఉపయోగించవచ్చు
 • దిగుమతి చేయబడిన ఐరోపా ఉత్పత్తుల ధరలో సగం ధరకు అందుబాటులో ఉన్నవి
 • ఉపయోగించడానికి మచ్చల క్రీముల కంటే ఎక్కువ అనుకూలమైనవి, ముఖ్యంగా బట్టలు కింద
 • సిలికాన్ జీవాణుగుణమైనది మరియు చర్మానికి అనుకూలమైనది మరియు అలర్జీని కలిగించదు
 • సిలికాన్ ఇతర పూత పదార్ధాల మాదిరిగా కాకుండా, ఉపయోగించే సైట్ లో ఎటువంటి సూక్ష్మజీవుల యొక్క వృద్ధిని ప్రోత్సహించదు
 • మచ్చ యొక్క పరిమాణం ఆధారంగా వివిధ సైజులలో అందుబాటులో వున్నాయి
 • మచ్చ యొక్క పరిమాణం మీద ఆధారపడి చిన్న ముక్కలుగా కట్ చేయవచ్చు
 • కడిగి మరియు తిరిగి ఉపయోగించ తగినవి

సిలికాన్ షీట్లను ఎలా ఉపయోగించాలి? 

 • గాయం లేదా శస్త్రచికిత్స ప్రదేశం పూర్తిగా నయం అయ్యింది అని నిర్ధారించుకోండి
 • స్కార్ ట్రీట్ సిలికాన్ షీట్ ను తగిన పరిమాణంలో కత్తిరించండి
 • జెల్-వైపు వున్న కాగితాన్ని తీసి వేయండి (పీల్ చేయండి)
 • మచ్చ పై చర్మం వైపుగా జెల్ ఉన్న వైపును ఉంచుతూ షీట్ ను అప్లై చేయండి
 • మొదటి 2 రోజుల పాటు రోజుకు 2 గంటల చొప్పున ఉపయోగించండి, ఆపై మీరు దానిని రోజుకు 12 గంటల పాటు ఉపయోగించే వరకు రోజుకు 2 గంటల చొప్పున పెంచండి
 • రాత్రి పూట షీట్ ను తీసివేయండి
 • ఒక సిలికాన్ షీట్ ను దాదాపు 2-3 వారాల పాటు తిరిగి ఉపయోగించవచ్చు. సిలికాన్ షీట్ ఖచ్చితమైన జీవితకాలం ఉపయోగించే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది
 • మచ్చ వాడిపోవడం ప్రారంభించడం అనే ప్రభావాన్ని గమనించడానికి దాదాపు 2 నెలల నిరంతర వాడుక సమయం పడుతుంది

సైజులు

 • 6 సెం.మీ. x 6 సెం.మీ.
 • 12 సెం.మీ. x 6 సెం.మీ.
 • 15 సెం.మీ. x 3 సెం.మీ.