Go to Top

సర్జికల్ ట్రస్స్- డైనా

Surgical Truss – Dyna

సర్జికల్ ట్రస్స్ (హెర్నియా బెల్ట్ అని కూడా పిలవబడుతుంది) యొక్క ప్రయోజనం

శస్త్రచికిత్స బహుశా ఉత్తమ శాశ్వత పరిష్కారం అయినప్పటికీ, హెర్నియా యొక్క తాత్కాలిక నిర్వహణ కొరకు ఒక సర్జికల్ ట్రస్స్ ఉపయోగించబడుతుంది.

హెర్నియా అంటే ఒక అంతర్గత అవయవం ఉబ్బడం ఉదా. ఉదర గోడలో బలహీనపడిన బిందువు గుండా ప్రేగు ఉబ్బడం. ఉదర గోడ పూర్తిగా మూసుకుపోకపోతే జనన సమయంలో హెర్నియాలు సంభవించవచ్చు. ఇది వృద్ధాప్యం లేదా ఒత్తిడితో కూడిన శారీరక శ్రమ కారణంగా కూడా జీవితంలో తర్వాత అభివృద్ధి కావచ్చు.

హెర్నియా యొక్క ఒక సాధారణ రకం గజ్జ లేదా మొల భాగ హెర్నియా. వంగుతున్నప్పుడు లేదా వస్తువులను  ఎత్తుతున్నప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు సాధారణంగా కొంత నొప్పి ఉంటుంది.

ఒక సర్జికల్ ట్రస్స్ లేదా హెర్నియా బెల్ట్ ఉపయోగించబడడానికి హెర్నియా తగ్గించబడగలగాలి అనగా మీరు తిరిగి ఉదరంలోకి హెర్నియాను నెట్టగలిగి ఉండాలి. దాని తరువాత, సర్జికల్ ట్రస్స్ ధరించటం అనేది ఆ ప్రదేశంలో ఒత్తిడిని ఉంచుతుంది మరియు తిరిగి మొదలు కాకుండా హెర్నియాను నిరోధిస్తుంది.

ఉదర కండరాల యొక్క బలహీనత కారణంగా కాకుండా (ఫేషియా అని పిలువబడే) కణజాలం యొక్క బలహీనత కారణంగా హెర్నియాలు ఏర్పడతాయి కాబట్టి , వ్యాయామాలు హెర్నియాను నయం చేయలేవు లేదా నిరోధించలేవు. వ్యాయామం అదనపు ఒత్తిడి, హెర్నియాను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.

డైనా సర్జికల్ ట్రస్స్ యొక్క లక్షణాలు?

  • తగ్గించగల్గిన గజ్జ హెర్నియాల నుండి డైనా సర్జికల్ ట్రస్స్ కొంత ఉపశమనాన్ని అందిస్తుంది
  • హెర్నియా మీద కేంద్రీకృతమైన ఒత్తిడితో సున్నితమైన ఒత్తిడిని మరియు బలహీనపడిన కండరాలకు మద్దతు అందించడానికి ఆ మద్దతు రెండు సర్దుబాటు చేయగల (& తొలగించగల) కంప్రెషన్ ప్యాడ్లను కలిగి వుంటుంది
  • దీనిని ద్వైపాక్షిక హెర్నియాల కోసం రెండు ప్యాడ్లతో మరియు ఏకపక్ష హెర్నియా కోసం ఒక ప్యాడ్ ను తొలగించి ధరించవచ్చు
  • ఒక మృదువైన గొట్టపు లెగ్ స్ట్రాప్ తో కలుపబడిన ఒక సర్దుబాటు చేయగల ఎలాస్టిక్ హిప్ స్ట్రాప్, ప్రతి ఒక్కరికి సరిపోయేందుకు సులభమైన వ్యక్తిగత సర్దుబాటును కలిగివుంది
    డైనా సర్జికల్ ట్రస్స్ ను దుస్తుల కింద కనబడకుండా ధరించవచ్చు

డైనా సర్జికల్ ట్రస్స్ ను ఎలా ధరించాలి?

1. మీ వీపు మీద పడుకుని ఉదర గోడ లోపలకు హెర్నియా తిరిగి వెళ్ళే వరకు హెర్నియా వాపును మీ వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి.
2. వాపు ఉన్న భాగం పైన సర్దుబాటు చేయగల కంప్రెషన్ ప్యాడ్ తో నెమ్మదిగా సర్జికల్ ట్రస్స్ ను మీ ఉదరం మీద క్రింది వైపు ఉంచండి. అవసరమైతే, హెర్నియా లేని వైపు కంప్రెషన్ ప్యాడ్ ను తొలగించండి. హెర్నియా ఒక వైపు మాత్రమే ఉన్నా కూడా (ఏకపక్ష) రెండు వైపులా కంప్రెషన్ ప్యాడ్లను ఉపయోగించమని కొందరు వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. రెండు ప్యాడ్లను ధరించడము అనేది సమతుల్య ఒత్తిడిని తీసుకువస్తుంది మరియు మద్దతు లేని వైపు ఒక అదనపు భారం యొక్క ప్రమాదాన్ని నిరోధిస్తుంది.
3. మీ వీపు మీద పడుకుని, సాగే నడుము బెల్ట్ ను మీ శరీరం వెనుక జారవిడిచి మరియు బెల్ట్ కుడి వైపున చివరలో ఉండే వెల్క్రో స్ట్రాపింగ్ ను బిగించండి.
4. మీ వీపు మీద పడుకుని, సాగే స్ట్రాప్స్ ను మీ కాళ్ల చుట్టూ తీసుకుని వచ్చి నడుము బెల్ట్ మీద ఉండే బకల్స్ కి వాటిని కట్టండి.
5. లేచి నిలబడి సర్జికల్ ట్రస్స్ నేరుగా హెర్నియా పాయింట్ మీద ప్యాడ్లతో శరీరానికి సౌకర్యవంతంగా అమరేలా చూడండి.

డైనా సర్జికల్ ట్రస్స్ ను ఎలా తొలగించాలి?

1.ఎలాస్టిక్ కాలి పట్టీలలో ఏదో ఒక దానిని విప్పివేసి తరువాత రెండవ పట్టీని విప్పండి
2. నడుము బెల్ట్ ను విప్పి నెమ్మదిగా శరీరం నుండి ట్రస్స్ ను తొలగించండి

శుభ్రం చేయడానికి సూచనలు
శుభ్రం చేసే ముందు కంప్రెషన్ ప్యాడ్లను తొలగించి ఒక శుభ్రమైన గుడ్డతో వాటిని తుడవండి. గోరువెచ్చని నీటిలో తేలికపాటి సబ్బును ఉపయోగించి శుభ్రం చేయండి. పిండడాన్ని లేదా వడితిప్పడాన్ని మానుకోండి. సూర్యకాంతి లేదా వేడికి దూరంగా గది ఉష్ణోగ్రత వద్ద గాలికి ఆరనివ్వండి. డ్రై క్లీన్ లేదా ఇస్త్రీ చేయవద్దు.

సైజు

సెం.మీ. లలో నడుము చుట్టుకొలత

Hip circumferenceSizeSmallMediumLarge
Hip circumferenceIn cm70-8080-9090-100