Go to Top

షోల్డర్ ఇమ్మోబిలైజర్ – డైనా

మనం అత్యంత అనుకూలంగా భుజాన్ని కదలకుండా చేయడానికి ఒక షోల్డర్ ఇమ్మోబిలైజర్ ను ఎందుకు వాడాలి?

శరీరంలో అత్యధికంగా కదిలే కీలు అయిన భుజం కూడా అత్యంత సంభావ్య అస్థిరమైన కీళ్ళలో ఒకటి. ఫలితంగా, ఇది అనేక సాధారణ సమస్యల యొక్క స్థానం. వాటిలో బెణుకులు మరియు ఒత్తిళ్ళు లేదా డిస్ లొకేషన్ (ఏదైనా భాగం పక్కకి జరుగుట), బర్సైటిస్ (కాపు తిత్తుల వాపు), విరుగుళ్లు, మరియు ఆర్థరైటీస్ కూడా ఉంటాయి.

మానవ శరీరంలో అతిగా వాడబడే కీలులో ఒకటి అయినందుకు, అది అనేక గాయాలకు గురికావచ్చు, ప్రధానంగా భుజము జారుటకు. అది ముఖ్యంగా మీరు పడిపోయినప్పుడు లేదా భుజం కీలు లో ఆకస్మిక ఇబ్బందికరమైన కదలిక ఉన్నప్పుడు జరుగుతుంది.

ఇటువంటి పరిస్థితుల్లో భుజం కీలుకు మద్దతివ్వటానికి మరియు అది అతిగా కదలకుండా నియంత్రించడానికి తద్వారా మరింతగా జారుటను నివారించడానికి షోల్డర్ ఇమ్మోబిలైజర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

షోల్డర్ ఇమ్మోబిలైజర్ 3 రకాలలో లభ్యమవుతుంది:

షోల్డర్  ఇమ్మోబిలైజర్ – డైనా

Shoulder Immobiliser - Dyna

వాడుకలో సౌలభ్యం కోసం మరియు ఒక భాగమును మెరుగ్గా కదలకుండా చేయుట కోసం రెండు వేర్వేరు భాగాల డిజైన్ లో వస్తుంది.

డైనా షోల్డర్ ఇమ్మోబిలైజర్ యొక్క ప్రధాన లక్షణాలు 

  • అన్ని వాతావరణ పరిస్థితుల్లో ధరించడానికి సౌకర్యవంతమైనది, సాన్ఫోరైజ్డ్ నూలుతో తయారు చేయబడింది (ఇది దానిని సౌకర్యవంతంగా చేస్తుంది)
  • భుజం కీలుకు అత్యంత అనుకూలమైన స్థిరీకరణ అందించడానికి రూపొందించబడింది
  • సరైన మద్దతు కోసం సులభంగా స్థానంలో ఉంచవచ్చు
  • మోచేతి పైభాగం మరియు ముంజేయిని 90 డిగ్రీల కోణంలో ఉంచుతుంది

షోల్డర్ ఇమ్మోబిలైజర్ యొక్క పరిమాణ వివరణ: 

మోచేయి నుండి అరచేతి ఎముకల వరకు ఉండే పొడవు సెం.మీ. లలో

Circumference Measurement around elbowSizeSmallMediumLargeX-Large
Length from elbow to metacarpelIn cm30-3434-3838-4242-46

 

షోల్డర్ ఇమ్మోబిలైజర్ స్పెషల్- డైనా

Shoulder Immobiliser Special – Dyna

డైనా షోల్డర్ ఇమ్మోబిలైజర్ యొక్క ప్రధాన లక్షణాలలో ఇవి ఉంటాయి 

  • ఎలాస్టిక్ తో తయారు చేయబడిన ఏక భాగ డిజైన్
  • మోచేతి పైభాగం మరియు ముంజేయికు మద్దతు ఇస్తుంది
  • వాడడం చాలా సులభం
  • మోచేతి పైభాగం మరియు ముంజేయిని 90 డిగ్రీల కోణంలోఉంచుతుంది

షోల్డర్ ఇమ్మోబిలైజర్ స్పెషల్ – డైనా బ్రీత్

Shoulder Immobiliser Special – Dyna Breath
గాలి ఆడే సాగే పదార్థంతో తయారు చేయబడుతుంది. దాని లక్షణాలు

  • ముంజేయి మరియు మోచేతి పైభాగం స్థాయిలో రెండు పట్టీల వ్యవస్థ మోచేతిని 90º కోణంలో ఉంచుతుంది
  • అతిశయంగా ఉన్న భుజం కదలికలను క్రియాశీలంగా స్థిరీకరిస్తుంది, సహాయం చేస్తుంది మరియు పరిమితం చేస్తుంది
  • అద్భుతమైన స్థిరీకరణను అందిస్తుంది
  • వాడడం సులభం

సూచనలు 

  • భుజం కీలు యొక్క కదలికను పరిమితం చేస్తుంది
  • భుజము జారుట, కీళ్ళ లో కొంత భాగము తొలగుట మరియు ఆపరేషన్ తర్వాతి పరిస్థితుల కొరకు అనువైనది

షోల్డర్ ఇమ్మోబిలైజర్ స్పెషల్ యొక్క పరిమాణ వివరణలు:
ఛాతీ చుట్టుకొలత సెం.మీ. లలో

Circumference Measurement around chestSizeSmallMediumLargeX-Large
Chest circumferenceIn cm70-8080-9090-100100-110